సిరా న్యూస్, డిజిటల్:
రాష్ట్ర స్థాయిలో మెరిసిన సాంగ్వి విద్యార్థిని…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన తుమ్మల శ్రీనివాస్ రెడ్డి కుమార్తె, తుమ్మల ద్వితి రాష్ట్ర స్థాయిలో సత్తాచాటింది. బుధవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) పరీక్షా ఫలితాల్లో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించారు. కాగా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో ఆమెను పలువురు అభినందించారు. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.