సిరాన్యూస్, ఆదిలాబాద్
రాజేష్‌కుమార్ సక్సేనా స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీలు
ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పోలీస్ అబ్జర్వర్ రాజేష్ కుమార్ సక్సేనా ఐపీఎస్ 2011(యూపీ) గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈసందర్భంగా పెన్ గంగా గెస్ట్ హౌస్ లో ఆయనకు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పూల మొక్క అందించి స్వాగతం పలికారు.