సిరాన్యూస్, ఆదిలాబాద్
కుమ్రం భీమ్ కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలి : సుహాసిని రెడ్డి
* సమావేశానికి హాజరైన ప్రొఫెసర్ కోదండరాం
కుమ్రం భీమ్ కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. గురువారం తుడుందెబ్బ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీమ్ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కొమ్రంభీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాలనీలో కనీస వసతులు కల్పించాలని ఆదివాసులు ఎన్ని మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. చివరికి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారని, అయినా ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. ప్రభుత్వాలు మారినా ఆదివాసీల బ్రతుకులు మారడం లేదని ఆరోపించారు. కోదండరాం సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు.