సిరా న్యూస్, ఆదిలాబాద్ (ఎడ్యుకేషన్):
జేఈఈ అడ్వాన్స్‌లో కెమిస్ట్రీ రెసోనెన్స్ హవా…
+ ఆల్ ఇండియా 347 ర్యాంక్ సాధించిన జే. సాక్షిత్
+ 98.06 పర్సెంటైల్ సాధించి ఆదిలాబాద్‌లో టాపర్‌గా నిలిచిన దరహాస్
+ 95.69 పర్సెంటైల్‌తో అదరగొట్టిన బి. చైతలి
గురువారం విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ‘కెమిస్ట్రీ రెసోనెన్స్ జూనియర్ కాలేజీ’ హవా కొనసాగింది. ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షలో రెసోనెన్స్కి చెందిన 9మంది విద్యార్థులు అర్హత సాధించి మరో మారు సత్తాచాటారు. కాలేజీకి చెందిన జే. సాక్షిత్ జాతీయ స్థాయిలో 347 ర్యాంక్ సాధించగా, మరో విద్యార్థి ఆర్. దరహాస్ ఏకంగా 98.06 పర్సెంటైల్‌తో ఆదిలాబాద్‌లో టాప్‌గా నిలిచాడు. విద్యార్థిని చైతలి సైతం 95.69 పర్సైంటైల్తో జేఈఈకి అర్హత సాధించింది. వీరితో పాటు బి. ఐశ్వర్య, బి. పవన్ తేజ, ఈ. సాయి శ్రీకర్, టి. సృజన్, కే. ఆకాశ్, ఎస్. సిద్ధార్థ్‌లు సైతం అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ డి. ప్రమోద్ రెడ్డి తెలిపారు. మొత్తం 9మంది విద్యార్థులు అర్హత సాధించగా, వారికి పాఠశాల యాజమాన్యం తరపున ప్రత్యేకంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.