సిరా న్యూస్, ఖానాపూర్ టౌన్
ఆదిలాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డ
* కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్
ఆదిలాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గురువారం పాత్రికేయులతో మాట్లాడారు. రాబోయే అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 100 వంద రోజుల్లో ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చమని, ఇది ప్రజా పాలన ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శయశక్తుల పనిచేస్తున్నామన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బడుగు బలహీన వర్గాల రైతులు సుభిక్షంగా ఉంటారని, అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తూ జిల్లాలో నాయకులు, కార్యకర్తలు ప్రతి జిల్లా మండల గ్రామాల నాయకులు పార్టీ కోసం కృషి చేయాలని కోరారు.