రాజస్థాన్ లో మరో యోగి

సిరా న్యూస్,జైపూర్;

బీజేపీ మరో హిందుత్వ ముఖచిత్రాన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుందా? రాజస్థాన్ లో బాబా బాలక్‌నాథ్ మరో యోగి కాబోతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించడంతో ఈ ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న వారిలో ఆల్వార్‌ ఎంపీ, ఆధ్యాత్మిక గురువు బాబా బాలక్‌నాథ్‌ ఒకరు. ఆయన రాజస్థాన్‌ యోగిగా ప్రసిద్ధి చెందారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లా కాషాయ దుస్తులు ధరించే బాబా బాలక్‌నాథ్‌యే ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిఅయ్యే అవకాశం ఉందనే చర్చ సర్వత్రా జరగుతోంది. 40 ఏళ్ల బాలక్‌నాథ్‌.. ఆదిత్యనాథ్‌లా.. నాథ్‌ సంప్రదాయానికి చెందినవారు. బెహ్రోడ్‌లోని ఓ గ్రామంలో 1984లో యాదవ కుటుంబంలో బాలక్‌నాథ్‌ జన్మించారు. 12వ తరగతి వరకూ చదివారు. తన బ్యాంకు ఎకౌంట్‌లో కేవలం12 లక్షలే ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రోహ్‌తక్‌లోని మస్త్‌నాథ్‌ మఠానికి బాలక్‌నాథ్‌ ఎనిమిదో మహంత్‌. నాథ్‌ సంప్రదాయానికి చెందిన అతి పెద్ద మఠాల్లో ఇది ఒకటి. ఈ మఠం విద్యా సంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తుంది. తిజారాలో ఇమ్రాన్‌ఖాన్‌ అనే అభ్యర్థి పై పోటీ చేసి విజయం సాధించారు. బాలక్‌నాథ్‌ తరఫున యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *