సిరా న్యూస్, జైనథ్:
బిజెపిని గెలిపించిన కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు…
+ బిజెపి జైనథ్ మండల అధ్యక్షుడు కట్కం రాందాస్
బిజెపి అసెంబ్లీ అభ్యర్థి పాయల్ శంకర్ అహర్నిశలు కృషిచేసిన జైనథ్ మండల నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులకు బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఖడ్గం రాందాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ లో అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కరుణాకర్ రెడ్డి, నాయకులు సామ రాకేష్ రెడ్డి, సామ రమేష్ రెడ్డి, లస్మన్న యాదవ్, బండి రవి యాదవ్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.