సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ 11 వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్ ఇచ్చిన మాట ప్రకారం గుండు కొట్టించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్ లో రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడతాయని, అలా జరగని పక్షంలో గుండు కొట్టించుకుంటానని వాగ్దానం చేశారు. అనూహ్యంగా రామాయంపేట పట్టణంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధిక ఓట్లు వేశారు. దీనితో ఇచ్చిన మాట ప్రకారం చిలుక గంగాధర్ గుండు కొట్టించుకున్నారు.