Atram Suguna: అత్రం సుగుణ గెలవాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజ‌లు

సిరాన్యూస్‌, ఖానాపూర్‌
అత్రం సుగుణ గెలవాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజ‌లు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ఎంపీ అభ్యర్థి సుగుణ గెల‌వాల‌ని నాయ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేప‌ట్టారు. అనంత‌రం ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపే లక్ష్యంగా గడపగడపకు వెళ్లి  నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు గ్యారంటీ కార్డు గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీటీసి జంగిలి సరిత- శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతుందని , అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లలో వచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా మళ్లీ ఎంపీ ఎలక్షన్లో ఇంకా నూతనంగా 5 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జంగిలి సరిత – శంకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, గుగ్లావత్ రాజేందేర్ సర్పంచ్, గ్రామ యూత్ అధ్యక్షులు మోర్తటి వంశీ, మండల పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేట్ మహేష్ సోన్న, శ్యామ్, మామడ శ్రీనివాస్, గాజుల గంగన్న, గాజుల నర్సయ్య, తదితరులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *