నెల్లూరు, బాపట్ల, ప్రకాశం సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు
సిరా న్యూస్,బాపట్ల ;
ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న మిగ్‌జాం తుఫాన్ తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో ఇది తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తున్న మిగ్‌జాం తుఫాన్ తీరాన్ని తాకింది. బాపట్ల సమీపంలో ఇది తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటల్లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ కారణంగా నెల్లూరు, బాపట్ల, ప్రకాశం సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.కోస్తాంధ్ర తీరానికి అత్యంత దగ్గరగా మిగ్‌జాం తుఫాన్ కదులుతోందని అంతకుముందు ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాన్‌లో కొంత భాగం సముద్రంలో.. మరికొంత భాగం భూమిపై ఉన్నట్లు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. తుఫాన్ కేంద్రకంలోని మేఘాలు భూభాగంపై ఉన్నట్లు వెల్లడించింది.