సిరాన్యూస్, బోథ్
పెళ్లి వేడుకల్లో అందరిని ఆకర్షించిన జంబో ఫ్యామిలీ
నేటి రోజుల్లో కుటుంబ విలువలకు తిలోదకాలు ఇస్తున్న తరుణంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాలకి చెందిన చెట్లపెళ్లి సదానందం కుమారుని వివాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సమయము లేదు అంటూ కుటుంబములో జరిగే శుభకార్యాలకు వెళ్ళలేని ఈనాటి పరిస్థితుల్లో చెట్లపెళ్లి వంశవృక్షనికి చెందిన ప్రతిఒక్కరూ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు.”ఉమ్మడి కుటుంబం అనేది గతం” అంటూ ఉంటాము. ఉద్యోగ, వృత్తి రీత్యా వివిధ ప్రదేశాల్లో స్థిరపడిన ఈ కుటుంబానికి చెందిన సుమారు 150 మంది కుటుంబసభ్యులు ఓకె చోట చేరి సందడి చేశారు.కుటుంబం అంటే ఇలా ఉండాలి అని గుసగుసలాడటం వినిపించింది.