Loka Praveen Reddy: రిమ్స్‌లో లోక ప్రవీణ్‌ రెడ్డి అన్నదానం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

రిమ్స్‌లో లోక ప్రవీణ్‌ రెడ్డి అన్నదానం

కాంగ్రెస్‌ నాయకులు లోక ప్రవీణ్‌ రెడ్డి తన సతీమణితో కలిసి ఆదిలాబాద్‌ పట్టణంలోని రిమ్స్‌లో అన్నదానం నిర్వహించారు. సోమవారం తమ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ మేరకు రోగులకు, వారి సహాకులకు స్వయంగా వడ్డించి అన్నదానం గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు అభినవ సర్ధార్‌ మట్లాడుతూ… సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడు ముందు వరుసలో ఉండే లోక ప్రవీణ్‌ రెడ్డి యువతకు ఆదర్శమని అన్నారు. అన్ని వేళలో నిరుపేదలకు బాసటగా నిలిచే ఆయన, ఇలాంటి వివాహా వార్షికోత్సవాల్లో మరెన్నో జరుపుకోవాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా లోక ప్రవీణ్‌ రెడ్డి మాట్లాడుతూ… ఎల్లప్పుడు ప్రజల నడుమ ఉంటూ, నిరుపేదలకు సేవ చేసుకునే అవకాశం తనకు దక్కడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జర్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిద పార్టీల నాయకులు, రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *