సిరాన్యూస్, చిగురుమామిడి
సీపీఐ బొమ్మనపల్లి గ్రామ కార్యదర్శిగా అందే సంపత్
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ) బొమ్మనపల్లి గ్రామ కార్యదర్శిగా అందే సంపత్ ను నియమించినట్లు మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి తెలిపారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ శాఖ జనరల్ బాడీ సమావేశం బి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. గ్రామ కార్యదర్శి గా అందే సంపత్, సహాయ కార్యదర్శిగా కుందేల వెంకటయ్య, కోశాధికారిగా బండారుపల్లి తిరుపతి లను నియమించారు. మిట్టపల్లి దిలీప్ ఏఐవైఎఫ్ అధ్యక్షుడు తాళ్ళ అవినాష్, ఏఐఎస్ఎఫ్ గ్రామ అధ్యక్షుడు, కాంపల్లి రాజయ్య వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ అధ్యక్షుడు లను నియమించారు. తమపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు మండల, జిల్లా నాయకత్వానికి సంపత్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి జీల సంపత్, జిల్లా ముద్ర కొల రాజయ్య, వెంకట క్రాంతి, గణేష్, భరత్, గంట చిన్న, బిక్షపతి, యాకయ్య, కే మహేందర్ తదితరులు పాల్గొన్నారు.