సిరా న్యూస్,కడప;
మే నెల ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు కడప పోలీసు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని కడప డీ.ఎస్పీ ఏం.డి. షరీఫ్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలoటే 24 గంటల ముందు లిఖితపూర్వకంగా పోలీసు వారికి అర్జి ఇచ్చి వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా కాని పక్షములో చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని కడప డి.ఎస్పీ ఎం.డి షరీఫ్ తెలిపారు.
=======