సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో ప్రపంచ కార్మికుల దినోత్సవం
ఓదెల మండల కేంద్రంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఓదెల హమాలీ సంఘం ఆధ్వర్యంలో 138 ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. మేడే మొదట చికాగోలోని 1905లో స్థాపించడం జరిగింది. కార్మిక శక్తులన్నీ ఒకటి కావాలని, మేడే వర్థిల్లాలని కార్మికులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం గ్రామ అధ్యక్షులు లింగన్న, గోలి చంద్రమౌళి, గరిగంటి శంకరయ్య, బొల్లం శంకర్, ఎంబాడి సతీష్, ఎంబాడి స్వామి, రామినేని స్వామి, లింగయ్య, బియ్యాల, మల్లేష్, మంద కొమురయ్య, తిప్పని కొమురయ్య, వంగ శ్రీనివాస్, అప్పని కుమారస్వామి, ఎండి అలీమా, బోయ సరోజన, బోయ సుమలత, సూరం స్వామి, భారతాల స్వామి, బోడకుంట రాజేశం పాల్గొన్నారు.