ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి బీమా పరిహారం చెల్లించాలి….
రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు
సిరా న్యూస్, దేవనకొండ;
కరువు నేపథ్యంలో నష్టపోయిన రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు 50 వేల పరిహారం ఇవ్వాలని అదేవిధంగా జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని వలసలు నివారించాలని సీజనల్ హాస్టల్ లో ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి అశోక్ లు డిమాండ్ చేశారు.మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ కమిటీల పిలుపు మేరకు దేవనకొండ తాసిల్దార్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి తాసిల్దార్ వెంకటేష్ నాయక్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి వీర శేఖర్, సీఐటీయూ మండల కార్యదర్శి అశోక్ లు మాట్లాడుతూ జిల్లాను కర్నూలు జిల్లాగా ప్రకటించి, కరువు ప్రాంతాల్లో కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని పంటల బీమా నష్టం జరిగిన మేర ఇవ్వాలని డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా నిత్యం కరువు కాటకాలకు గురవుతుందని గత మూడు సంవత్సరాలుగా వరుస కరువులతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయనా గత సంవత్సరం చేసిన అప్పుల పదనుండే విముక్తి అవుదామని ఈ సంవత్సరము కూడ అప్పులు చేసి వివిధ పంటలు సాగు చేసిన రైతులకు వర్షాభావ పరిస్థితులు వల్ల వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు కు దిక్కుతోచని పరిస్థితి నెలకొని ఉందని వారు అన్నారు