సిరా న్యూస్, కుందుర్పి
టీడీపీలో చేరిన 28 ముస్లిం కుటుంబాలు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన 28 వైసీపీ ముస్లిం కుటుంబాలు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.