సిరా న్యూస్, సైదాపూర్
వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలి: మండల అధ్యక్షుడు దొంత సుధాకర్
* వెన్కేపల్లి గ్రామంలో గడపగడపకు ఎన్నికల ప్రచారం
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ అన్నారు. శుక్రవారం సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి గ్రామం లో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ఓటు వేయాలని గడప గడపకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు అభివృద్ధి చేసింది శూన్యమన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు వెల్ది రాజు, క్లస్టర్ ఇంచార్జ్ గుంటి స్వామి,మాజీ సర్పంచ్ మునుపాల రవి, సదానందం, రోషన్, రాజు బొమ్మగోని రాజు, జంపాల చంద్రయ్య, అమరగొండ శ్రీనివాస్, అమరగొండ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.