బికెయంయు నేత తాటిపాముల వెంకట్రాములు
సిరా న్యూస్,హన్మకొండ;
ఉపాధి హామీ పనులకువెళ్తున్న కూలీలకు పని ప్రదేశాలలో ఎండవేడిమిని తట్టుకోవడానికి టెంట్లు, మంచినీరు మొదలైన కనీస ప్రాథమికసౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనందున తీవ్రమైన ఎండలకు ఉష్ణోగ్రతలు పెరిగి వడదెబ్బలకు గురై కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో ఉపాధి కూలీ పనికి వెళ్లిన ఫకీరు మహమ్మద్ ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా బుధవారం మృతి చెందడంతో ఆయన భార్య ముగ్గురుకుమార్తెలుఇద్దరుకుమారులు అనాధలుగా మారారని నిరుపేదలైన కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయిందన్నారు. ఇలాంటి మరణాలు రాష్ట్రవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయని ఇప్పటికే ఎంతోమందికూలీలుతమప్రాణాలనుకోల్పోయారన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు పరచడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పనికి పోకపోతే కుటుంబం గడవని దౌర్భాగ్యపరిస్థితి వెళ్తే అక్కడ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి,రోజుకురూ.300కూలీ ఇస్తామని కేంద్రం ప్రకటించిన కనీసంరూ.150 కూడా రానిపరిస్థితియుందని ,కూలీలజీవితాలతోచెలగాటమాడటం మానుకొనిఇప్పటికైనా కనీస సౌకర్యాలు కల్పించాలని , పెరిగిన ధరలకు అనుగుణ్యంగా కనీసం రూ.600కూలీ ఇవ్వాలన్నారు. వడదెబ్బలకు, ప్రమాదవశాత్తుమరణించిన కూలీల కుటుంబాల వారికి రూ. 25 లక్షలు ఎక్స్గ్రేసియో చెల్లించిఅన్ని విధాల ఆదుకోవాలని వెంకట్రాములు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
===========================