Ravindra Chari: ప్రజాస్వామ్యంలోనే ఏకైక ఆయుధం పత్రిక…

సిరా న్యూస్, ఓదెల
ప్రజాస్వామ్యంలోనే ఏకైక ఆయుధం పత్రిక…
కోడి కూయక ముందే ప్రజలను నిద్ర నుంచి లేపేదే పత్రి
హలం పట్టిన రైతన్నను చూస్తే పంట గుర్తుకొస్తుంది.
కలం పట్టిన విలేకరిని చూస్తే దర్పణం గుర్తుకొస్తుంది.
పత్రిక లేనిదే ప్రపంచానికి మనుగడలేదు.
చీకటి ప్రపంచాన్ని వెలుగులోకి తెచ్చేదే పత్రిక.
ప్రజాస్వామ్యంలోనే ఏకైక ఆయుధం పత్రిక.ఆనాటి స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి తెలంగాణ ఉద్యమానికి జీవం పోసి అంకురార్పణ చేసింది పత్రిక
నిప్పులాంటి అక్షరాలను చూస్తే ఏ మనిషికైనా చెమటలు పట్టాల్సిందే.
ప్రజాస్వామ్యంలో అవినీతిపై యుద్ధం చేసేదే పత్రిక గల్లి నుండి ఢిల్లీ వరకు .
సామాన్యుడి నుండి దేశ రాష్ట్రపతి వరకు నిత్యం చదువుతూ ఉంటారు పత్రిక.
వజ్రాల లాంటి అక్షరాలను పేర్చి ప్రజాస్వామ్యంలో వెల్తురు కంటే వేగంగా వచ్చేదే పత్రిక.
పత్రికలకు ఉన్న విలువ ప్రజాస్వామ్యంలో మరి దేనికి లేదు. పుట్టుకకైనా.. చావు కైనా.. సాహిత్యానీకైనా.. సమరానికైనా.. రాజకీయానికైనా.. రంగ స్థలానికైనా.. సినిమాలకైనా.. వ్యాపారాలకైన.. నీకంటూ ప్రజాస్వామ్యంలో ఒక గుర్తింపు ఉండాలంటే ఒక పత్రికతోనే సాధ్యం. ప్రజల భావా ప్రకటనా స్వేచ్ఛను కాపాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నిలిచేదే పత్రిక. మానవ మనగడ ఉన్నంతవరకు పత్రిక స్వేచ్ఛకు భంగం కలగదు.

రచన. బ్రాహ్మాండ్లపల్లి రవీంద్రా చారి, (గవర్నర్ అవార్డు గ్రహీత), ఓదెల . పెద్దపెల్లి జిల్లా, సెల్.9989464261

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *