అంబేద్కర్ కు నివాళులు అర్పించిన సోనాల వాసులు.
సోనాల (సిరా న్యూస్)
సోనాల మండల కేంద్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నివాళులు నాయకులు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమములో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సోన్న హరీష్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా వారికీ పూల మాలలు వేసి కొవ్వాత్తులు వెలిగించి నివాళులు అర్పించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం మొత్తం దేశం కోసం బడుగు బలహీన వర్గాల కోసం దేశ రాజ్యాంగం కోసం నిర్విరామ పోరాటం చేసి దేశానికి రాజ్యాంగం అందించారని ఆయన స్ఫూర్తితో ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల కోసం పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెట్లపెళ్లి సదానందం , భగత్ ప్రవీణ్,గాజుల పోతన్న ,రమేష్ బత్తుల, భీమ్ రావ్, మహేష్, అమృత్ రావ్, దినేష్, నరేష్, అనిల్, సంతోష్, రాహుల్, లక్ష్మణ్, శేఖర్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.