ఇంద్రవెల్లి లో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి…
సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఇంద్రవెల్లి మండలకేంద్రంలో ఆయన విగ్రహానికి అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబా సాహిబ్ అంబేద్కర్ కి జై, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మనోహర్ సోంకంబ్లే, కామరాజ్ వగ్మారే, లహుదాస్ సవంత్, ఉత్తం కాంబ్లే, రాజ్ వర్ధన్ మస్కే, బీమ్ ఆర్మీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.