హోమ్ ఓటింగ్ లో వైసీపీ నాయకులు హల్ చల్..

సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ సంగం మండలం కోలగట్లలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. వృద్ధులు వికలాంగుల కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాటుచేసిన హోమ్ ఓటింగ్ ప్రక్రియలో అధికారులతో కలిసి పాల్గొన్నారు. రహస్యంగా జరగాల్సిన ప్రక్రియలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి అధికారులతో చట్టపట్టలేసుకుని ఓటర్ ఇంట్లో కూర్చోవడం విమర్శలకు దారితీస్తుంది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించవలసి ఉంటే అధికారులు వైసీపీ నాయకులతో కలిసి ఓటర్ ఇంటికి వెళ్లడంపై జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
==========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *