సిరాన్యూస్, ఆదిలాబాద్
పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల బీఆర్ఎస్ నాయకులు శనివారం బీజేపీలో చేరారు. జైనథ్ మండలం బీఆర్ఎస్ చెందిన నాయకులు వార్డ్ మెంబర్ అశోక్, పెండల్ వాడ ఆంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ సంజయ్, అశోక్‌లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు అశోక రెడ్డి, నరేష్, తదితరులు ఉన్నారు.