మహా కూటమి ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులకి మద్దతుగా కూటమి నాయుకులు ప్రచారం

సిరా న్యూస్,పరవాడ;
మండల కేంద్రం అయ్యిన పరవాడలో ఊర చెరువులో పనికి ఆహార పథకం కింద పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేన పరవాడ మండల ఇంచార్జి పంచకర్ల ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు పైల జగన్నాథరావు, పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ గా కమలం గుర్తుకి, ఎంఎల్ఏ గా గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు వియ్యపు చిన్నా, రావాడ సర్పంచ్ మోటూరు సన్యాసినాయుడు, జనసేన మండల అధ్యక్షులు బొద్దపు శ్రీనివాస్ కాసుల, నాయుడుపాలెం మాజీ ఎంపీటీసీ కూండ్రపు శ్రీరామమూర్తి, టీడీపీ నాయకులు పైల రామచంద్రరావు, వార్డు సభ్యులు గండి ఈశ్వరరావు, సిరిపురపు రాజేష్, కూటమి నాయకులు రెడ్డి శ్రీను,పైలా బుజ్జి, కూండ్రపు సోమునాయుడు, పైల కృష్ణ, చుక్క నాగు, బొద్దపు అయ్యబాబు, వేచలపు సత్యం, గణపర్తి ఈశ్వరరావు, లాలం సన్యాసిరావు, బండారు రాజు, రెడ్డి నాయుడు (మెకానిక్), చుక్క గోపి, రెడ్డి చిన్నా, రెడ్డి ఏర్నాయుడు, కూండ్రపు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
=========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *