Advocates Join Congress: కాంగ్రెస్‌లో చేరిన న్యాయవాదులు

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

కాంగ్రెస్‌లో చేరిన న్యాయవాదులు
+ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీతక్క
+ కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో భారీగా చేరికలు

కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో, న్యాయవాది అఫ్రోజ్‌ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క న్యాయవాదులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించింది. కాగా రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి న్యాయవాదులకు సూచించారు. పార్టీలో కష్టపడిన వారికి ఎల్లప్పుడు సముచిత స్థానం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన న్యాయవాదుల్లో మాజీ ఏపీపీలు మేకల మధుకర్, సంజయ్‌ కుమార్, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎంబడి సంతోష్, న్యాయవాదులు డి. నాగేశ్వర్, డీ.ఎస్,పీ, శర్మ, టి. వెంకట్‌ కుమార్, షేక్‌ మన్షీర్, కే రవీందర్, ముజాహిద్‌ హుస్సేన్, ఎం నరేందర్, బి. రాము, గులాం ఇమ్రాన్, ఎస్‌ భగవాండ్లు, ఆర్‌ ప్రశాంత్, ఠాకుర్‌ కౌశిక్, మహ్మద్‌ సాబీర్, సద్దాంబీన్‌ మహ్మద్, నలగంటి నవీన్‌ కుమార్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *