సిరా న్యూస్,గుంటూరు;
పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత వారాహి యాత్ర ఎప్పుడు. సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడటంతో వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇచ్చారా. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర తాత్సారం వెనుక ఉన్న కారణాలు ఏంటి. లోకేష్ యువగళం కొనసాగుతున్న వేళ పవన్ యాత్రకు బ్రేక్ ఇచ్చారా.. పవన్ వారాహి యాత్ర 5.0 ఎప్పుడు.. ఎక్కడ నుంచి ప్రారంభం కానుంది. అనే అనేక ప్రశ్నలు సామాన్యుల్లోనే కాదు పవన్ అభిమానుల్లోనూ నెలకొంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారాహి యాత్ర ఐదో విడత ప్రారంభం ఎప్పుడన్న అంశంపై జనసేన పార్టీలో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇప్పటికే వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్.. కృష్ణా జిల్లాలో నాల్గవ విడతతో ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. వారాహి యాత్ర మొదటి విడత అన్నవరంలో ప్రారంభం కాగా నాలుగు విడతల్లో మొత్తం 37 రోజుల్లో 22 నియోజకవర్గాలలో పర్యటించారు. అయితే మొదటి నాలుగు విడతల్లో సక్సెస్ అయిన వారాహి యాత్రను 5విడత కూడా చేపట్టేందుకు పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పవన్ చేపట్టబోయే 5వ విడత యాత్ర ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా ప్రారంభం అవుతుందన్న దానిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఒకవైపు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటం మరోవైపు టిడిపితో పొత్తుపై పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళేలా అడుగులు వేస్తుండటం, సమన్వయ కమిటీల పేరుతో జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటాలు చేస్తున్న వేళ తాజాగా ఐదో విడత చేపట్టే యాత్రపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని భావిస్తున్నారు పార్టీ నాయకులు. అందులో భాగంగా నాలుగు విడతల్లో ముగిసిన దాని కంటే భిన్నంగా.. మరింత ధీటుగా 5వ విడత యాత్రతో ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళికలు రచిస్తున్నారు పవన్. ఇప్పటికే టిడిపితో పొత్తుపై ప్రకటన చేసిన తర్వాత జరిగిన నాలుగో విడత యాత్రలో అటు తెలుగుదేశం నేతలు సైతం భారీ ఎత్తున పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్నరాజకీయ పరిణామాల్లో చంద్రబాబు జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.