సిరా న్యూస్, సైదాపూర్
వెలిచాల రాజేందర్ రావు గెలవాలని కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక పూజలు
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అధిక మెజారిటీతో గెలవాలని సోమవారం సైదాపూర్ మండలం ఏక్లాస్పూర్ గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద కాంగ్రెస్ నాయకులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ సీనియర్ నాయకులు దస్తగిరి, క్రాంతి,రవీందర్ , చోటే సంపత్, రమేష్ ,సుమన్, రాజు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రఘు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.