ఓ వైపు ఎండలు… మరో వైపు వరదలు

సిరా న్యూస్;
భారత దేశం ఎండలతో మండిపోతోంది. అనేక రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. వేడి, ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. వడదెబ్బతో నిత్యం పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక తీవ్రమైన ఎండలు, పొడి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వర్షాలకు దుబాయ్‌లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలకు జనజీవనం స్తంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 142 మి.మీల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈతరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారుల పేర్కొటున్నారు. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వానలకు క్లౌడ్ సీడింగ్ కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.భూమిపై అత్యంత వేడి, పొడి ప్రాంతంలో యూఏఈలో ఉంటుంది. వేసవిలో ఇక్కడ గరిష్టంగా 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక వార్షిక వర్షపాతం సగటున 200 మి.మీల లోపు నమోదవుతుంది. దీంతో భూగర్భజల వనరులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు కృత్రిమ వర్షాలను కురిపించే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని యూఏఈలో ఎప్పటినుంచో అమలు చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా తాగునీరు అందించడమే ఈ క్లౌడ్‌ సీడింగ్‌ ఉద్దేశం. అయితే ఈ విధానం కొన్నిసార్లు ఆకస్మిక వరదలకు కారణమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. భారత్‌లో ఎండ చంపుతుంటే.. విదేశాల్లో వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.సౌత్‌ బ్రెజిల్‌ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. త్రిమ వర్షాలను కురిపించే పద్ధతిని యూఏఈ 1982 తొలినాళ్లలోనే పరీక్షించింది. అనంతరం అమెరికా, దక్షిణాఫ్రికా. నాసాకు చెందిన పరిశోధన బృందాల సహాయంతో 2000 తొలినాళ్లలోనే క్లౌడ్ సీడింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎమిరేట్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (ఎన్‌సీఎం)తో కలిసి యూఏఈ రెయిన్ ఎన్హాన్‌మెంట్ ప్రోగ్రాం (యూఏఈఆర్‌ఈపీ) దీనిని చేపడుతోంది. వాతావరణ మార్పులను ఇక్కడి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. యూఏఈతోపాటు ఈ ప్రాంతంలోని సౌదీ అరేబియా, ఒమన్‌ కూడా కూడా కృత్రిమ వర్షాల కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి.సాధారణంగా క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిలో సిల్వర్‌ అయోడైడ్‌ రసాయనం వాడతారు. ఈ తరహా హానికర రసాయనాలకు దూరంగా ఉన్న యూఏఈ క్లౌడ్‌ సీడింగ్‌కు సాధారణ లవణాలనే వినియోగిస్తుంది. టైటానియం ఆక్సైడ్ పూత కలిగిన ఉప్పుతో నానో మెటీరియల్‌ను ఎన్సీఎం అభివృద్ధి చేసింది. ఇలా నీటి సంక్షోభం ఎదుర్కొనేందుకు యూఏఈ వినూత్న విధానం అనుసరిస్తోంది. స్థానిక అవసరాల కోసం చేపట్టే కృత్రిమ వర్షాలతో తాత్కాలికంగా ప్రయోజనాలు ఉన్నా ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో వర్షాలు కురిపించాలంటే కరవుకు కారణమవుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా సహజ వనరుల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.80 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 56 మంది చనిపోయారు. దీంతోపాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రియో గ్రాండే దో సుల్‌లో పెరుగుతున్న నీటి మట్టాలు ఆనకట్టలపై మరింత ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఆనకట్ట తెగితే పెద్ద విపత్తు తప్పదని భయపడుతున్నారు.బ్రెజిల్‌ గవర్నర్‌ ఎడ్వర్డో లైట్‌ ఈ ప్రాంతంలో పర్యటించి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మృతుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డిసిల్వా వరద బాధిత ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరిస్తామని తెలిపారు.ఇక దక్షిణ బ్రెజిల్‌లోని దాదాపు 150 మునిసిపాలిటీలను వరదలు దెబ్బతీశాయి. 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. రియో గ్రాండే డోసుల్‌ ఇతర ప్రావిన్స్‌ నుంచి టెలిఫోన్, ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిపవేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మే 4 వరకు 20 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది.ఇక నాలుగు రోజుల క్రితం వరకు వర్షాలు, వరదలు ఆఫ్రికా దేశం కెన్యాను వణికించాయి. వరదలు ముంచెత్తడంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. డ్యాం తెగడంతో వందల మంది కొట్టుకుపోయారు. ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా.. పేద దేశం కావడంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. మోకాలి లోతు మేర బురద పేరుకుపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *