సిరా న్యూస్,నెల్లూరు;
సంగం కొండ సమీపం లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.చెన్నై నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.ఈ ప్రమాధం లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పిఏ గాజుల ఫరూఖ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు గాయాలైన వారిని 108 లో ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు.సిఐ రవి నాయక్,ఎస్సై నాగార్జున రెడ్డి లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
====================