సిరా న్యూస్,ఆచంట;
ఆచంట నియేజకవర్గం పెనుగొండలో కాపు ఆత్మీయ సమావేశంలో నరంపురం పార్లమెంట్ కూటమి అభ్యర్ది భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే అభ్యర్ది పితాని సత్యనారాయణ పాల్గోన్నారు ఈ కార్యక్రమంలో ఆచంట శాసన సభ్యుడు శ్రీరంగనాథరాజుపై శ్రీనివాస వర్మ సంచలన వాఖ్యలు చేసారు. ఆచంట నియేజఖవర్గంలో ఓసైకో శాసన సభ్యుడు ఉన్నాడు. అతగాడికి ప్రజలంటే అసహ్యం.. ప్రజల్ని ప్రేమగా పలకరించే పరిస్థితిలేదు. ప్రజలెవరైన . నమస్కరిస్తే అపహాస్యంచేస్తూ ఛీదరించుకుంటాడు ఆశాసన సభ్యుడు..శ్రీరంగనాథ రాజు. ప్రజలు ఎవరైనా అతగాడిని ప్రశ్నిస్తే అక్రకేసులు, అట్రాసిటీ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లు చుట్టూతిప్పిస్తాడు. శ్రీరంగ నాథరాజు కి రిటన్ గిఫ్ట్స్ ఇచ్చే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
ఎన్నికలు దగ్గర పడటంతో ఈ మధ్య కాలంలో నియోకవర్గంలో ఉన్న మహిళ లను పిలిచి నాఅక్క చెల్లళ్లలు అంటూ భోజనాలు, చీరలు పెట్టి అవి తిసుకున్న మహిళలను తనకు ఓట్లు వేయాలని లేకపోతే నా శాపం,ఉసురు తగులు తుందన్నాడు. ఈ రంగనాథ రాజు చరిత్ర ఏంటో తెలుసా ఆ భోజనాలు ఏక్కడ వండితెచ్చారోతెలుసా..అడబ్బులన్ని ఎవరివో తెలుసా…? భారతి విద్యా భవన పిల్లలు చదుకునేందుకు స్కూళ్ళు నడపడానికి కట్టిన డబ్బులను. మిగతా డైరెక్టర్లకు తెలియకుండా దోంగ పోర్జరి సంతకాలతో కోట్లాదిరూపాయలు విత్ డ్రా చేసారు.
పిల్లల డబ్బులనువిచ్చలవిడిగా నీ సోంత ఖాతాలకు మళ్ళించుకుంటే ఆ పిల్లలు ఉసురు నీకు తగలదా శ్రీరంగనాథరాజు. పెద్ద అవి నీతి తిమిగళం శ్రీరంగనాథరాజు భారతి విధ్యాభవన్స్ , రైసు మిల్లరు అసోషి యేషన్ డబ్బు కోటాను కోట్లు దిగ మింగాడు ఈ శ్రీరంగనాథరాజు. భారతీ విధ్యా భవన్స్ సోమ్ములతో నిర్మించిన మార్టేరు భస్ షేల్టర్స్ పునాధులు సైతం చదువుకునే పిల్లలవే. రైస్ మిల్లర్ అసోషియేషన్ శ్రీరంగనాథరాజును గుమ్మంకూడాతోక్కనీయడంలేదు. విధ్యాభవన్స్ ను పట్టుకుని ఏలాడుతున్నాడు. ఇటువంటి చరిత్ర హీనుడు ప్రజాప్రతినిధిగా ప్రజలకు అవసరమా అనిఅడుగుతున్నానని అన్నారు.
=====================