జగన్ పై షర్మిళ ఫైర్

సిరా న్యూస్,విజయవాడ;
తాను సీఎం జగన్ ను పని కావాలని అడిగినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె జగన్ పై విమర్శలు గుప్పించారు. తాను రూ.వెయ్యి కోట్ల పని అడిగానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలా మాట్లాడేవాళ్లు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడే వాళ్లే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ముందు ఇలా మాట్లాడుతున్నందుకు మీకు ఎంత అందుతున్నాయో చెప్పండి.? అంటూ నిలదీశారు. ‘రూ.వెయ్యి కోట్లు ఏంటి రూ.10 వేల కోట్ల వర్క్ అడిగాను అని కూడా చెప్తారు. నేను ఒక్క పైసా సహాయం అడగలేదు. అలా అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్లిపోతా. వీళ్లు ఊసరవెళ్లులు. అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారు. నా తల్లి విజయమ్మపై సైతం నిందలు వేశారు.’ అంటూ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *