సిరా న్యూస్,అమలాపురం;
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ వర్షం,ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. మంగళవారం రాత్రి నుంచి ఏడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా ఇళ్ళు మునిగిపోయాయి. అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. జనాలు బకెట్లతో బయటకు నీటిని. తొడుకుంటున్నారు. ఏకధాటిగా భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు పూర్తిగా మునిగిపోయి ఇళ్లలోకి నీ చేరింది. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.