సిరా న్యూస్, బేల
చేతి గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణను గెలిపించాలి : అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి
* బేల మండలంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం
నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తో నే సాధ్యమని, అందుకే చేతి గుర్తుకు ఓటేసి పార్టీ నిలబెట్టిన అభ్యర్ధి ఆత్రం సుగుణ ను గెలిపించాలని ఆదిలాబాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి ప్రజలను అభ్యర్ధించారు. మంగళవారం బేల మండలంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేపట్టింది. అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంతో హోరెత్తిస్తోంది.ఇప్పటికే దాదాపు నియోజకవర్గమంతా ఒక సారి చుట్టేసిన అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డికి మంగళవారం మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి తోడయ్యారు. ఇరువురు ఉదయం నుండి నిర్విరామంగా చేరికలు ప్రచార కార్యక్రమాలలో దూసుకు పోతున్నారు. బేల మండలంలో ముందుగా మాంగ్రూడ్ గ్రామం నుండి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు.గ్రామంలో రోడ్ షో నిర్వహించి ప్రజలకు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. భోజన విరామానికల్లా షెడ్యూల్ లో పొందు పరిచిన మాంగ్రూడ్ , ఖోగ్దూర్ , మొహబత్ పూర్ ,శంషాబాద్ ,కాప్సి,(బి) డోప్టాల , టాక్లీ ,భవాని గూడ , ఎకోరి ,మసాల(బి) డౌన , సయీద్ పూర్ , తోయగూడ గ్రామాలలో తమ ప్రచారాన్ని పూర్తి చేసుకుంటారు. గ్రామగ్రామంలో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.కాంగ్రెస్ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని ఎంతో చరిత్ర కలిగిన పార్టీ అన్నారు. ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది బెస్ట్ అని అందుకే తాను ఈ పార్టీలో చేరినట్టు తెలిపారు.ఈ పదేళ్లలో బీజేపీ కేవలం ధరలు పెంచడం తప్ప చేసిందేమీలేదని ఎద్దేవా చేసారు. 400 రూపాయలున్న సిలిండర్ ను 1200 కు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తాము గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీ కి ఓటు తోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా పరిపాలించగల సత్తా, సామర్ద్యం కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని గతంలో ఇది నిరూపితమైందని అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. కొన్ని పార్టీలు లేని పోని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు.వారి మోసాలకు చెక్ పెట్టేలా ప్రజలు నిర్ణయాత్మక తీర్పునిస్తుంటారని అన్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ప్రభుత్వం కూడా కేవలం వంద రోజుల్లోనే తామేంటో చేసి చూపి ప్రజల విశ్వాసాన్ని పొందిందని అన్నారు. ఈ సారి ఇక్కడ ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణ గెలుపే కాకుండా కేంద్రంలో కూడా ఇండియా కూటమి ఏర్పడుతుందని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేసారు. అక్కడ దేశంలో ధరలు పెంచుతాం , టాక్స్ లు వేస్తాం,రిజర్వేషన్లు తొలగిస్తం , చట్టాలు మారుస్తం అన్నట్టు బీజేపీ పాలన ఉందని ప్రజలు ఈ పదేళ్లు విసిగి పోయారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి , కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంఖడే, సుదాం రెడ్డి, ఎంపీటీసీ నగేష్ రెడ్డి, కళ్లెం మల్లా రెడ్డి, ఇట్టడి రాజా రెడ్డి, యూత్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు గన్ శ్యామ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మడవి చంద్రకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావర్ శంకర్ బొక్రె, అవినాష్ గోడే, ప్రభాకర్, హైమద్, రాజు, కరీం, మోబిన్, గులాబ్, నానాజీ పాటిల్, విలాస్ సవాపురే తదితరులు పాల్గొన్నారు.