సిరా న్యూస్, ఓదెల
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యేలా చూడాలి: డాక్టర్ శభాష్ ఖాన్
గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యేలా చూడాలని ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శభాష్ ఖాన్ అన్నారు. ఓదెల మండల కేంద్రంలోని మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొకసారి జరిగే ఆశ కార్యకర్తల రోజు డాక్టర్ శభాష్ ఖాన్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో వడదెబ్బ తలగకుండా ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆశా కార్యకర్తలకు డాక్టర్ తెలియజేశారు. గర్భవతులకు సమయానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందజేయాలని, ప్రతి గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించాలని ఆశా కార్యకర్తలకు తెలియజేశారు.చిన్న పిల్లలకు సరైన సమయానికి టీకా లు వేయాలని అన్నారు.కార్యక్రమంలో విద్యాసాగర్, రవి, 23 మంది ఆశా కార్యకర్తలు. 8 మంది ఏఎన్ఎంలు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.