సిరాన్యూస్, ఉట్నూర్
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు
* పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పని చేయాలి
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎందా గ్రామానికి, శాంతినగర్ కాలనీకి చెందిన బబీఆర్ఎస్, బీజేపీ నాయకులు గురువారం ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాల అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బిఆర్ఎస్, బీజేపీ, ప్రజా ప్రతినిధులు,నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.