సిరాన్యూస్, సైదాపూర్
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉపాధి హామీ కూలి రూ. 400
* యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిరుపతి నాయక్
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉపాధి హామీ కార్మికులకు రోజుకి 400 రూ-/ పని వేతనం లభిస్తుందని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిరుపతి నాయక్ అన్నారు. గురువారం సైదాపూర్ మండలంలోని రాయికల్ తండా లో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చేపార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిరుపతి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే పేదలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భిక్షపతి, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిరుపతి నాయక్, జివీఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, యూత్ నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.