సిరాన్యూస్, చిగురుమామిడి
అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కు ఓటు వేయండి :బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కోడలు డాక్టర్ హర్షిని
మత విద్వేషాలు తీసుకొచ్చే బిజెపికి కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు కన్నీళ్ళకు కాదు.. అభివృద్ధి చేసే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఎంపీ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ కోడలు డాక్టర్ హర్షిని అన్నారు. గురువారం చిగురుమామిడి మండలంలోని నవాబ్ పేట గ్రామంలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉపాధి హామీ కూలిలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.వారు మాట్లాడుతూ ఒకరి మతం పేరిట మరొకరు.. మార్పు పేరిట ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా బోయిన్ పల్లి వినోద్ కుమార్ రాష్ట్ర కరీంనగర్ ప్రజలకు ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు. 1000 కోట్లతో కరీంనగర్ కి స్మార్ట్ సిటీ, 3400 కోట్లతో ఐదు జాతీయ రహదారులు, ప్రసూతి హాస్పిటల్ 5 కోట్లు, అంబేద్కర్ స్టడీ సర్కిల్, మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు.ఎంపీ బండి సంజయ్ కుమార్ రాముని పేరు చెప్పుకోవడం తప్ప ఏ ఊర్లోనైనా ఒక్క దేవాలయమైన నిర్మించాడా అని ప్రశ్నించారు?? వినోద్ కుమార్ కరీంనగర్ కి టీటీడీ దేవస్థానం, ఇస్కాన్ టెంపుల్ 30 ఎకరాలు,కొండగట్టు ఆంజనేయస్వామి కి 330 ఎకరాల భూమిని కేటాయించారని అన్నారు.మత విద్వేషాలకు స్థానం ఉండదని అన్నారు.మోడీ కరీంనగర్ రావలసిన త్రిబుల్ ఐటీ కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్తే బండి సంజయ్ ఏం చేశాడని ప్రశ్నించారు.వినోద్ కుమార్ ను గెలిపిస్తే విద్య వైద్యం ఉపాధి అవకాశాలు పెంపొందించి ప్రజలకు న్యాయం చేస్తామని 13 తారీఖు నాడు వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మంకు శ్రీనివాస్ రెడ్డి, బోయిని మనోజ్, బోయిని సదానందం తదితరులు పాల్గొన్నారు.