పల్లె పల్లెకు రితేష్ పేరుతో పాదయాత్రకు శ్రీకారం
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ తెలుగుదేశం పార్టీ నేత సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితేష్ కుమార్ రెడ్డి చేపట్టే పాదయాత్ర ఈనెల ఏడవ తేది నుండి శ్రీకారం చుట్టబోతున్నారు. చెన్నంపల్లి లోని కళ్యాణ్ మండపం లో జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏడవ తేదీ ఉదయం కలసపాడు మండలంలో తేజ్ కుమార్ రెడ్డి పాదయాత్రకు మొదలు పెడుతున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సుమారు 300 కిలోమీటర్లు పొడవునా ఈ పాదయాత్ర సాగుతుంది
. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తున్నారు. బద్వేల్ నియోజకవర్గం రిజర్వు అయిన తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది జరగబోయే ఎన్నికల్లో ప్రజల అభిమానం ఓటర్ల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ఎంతో ధీమాగా ఉంది
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అట్లూరు గోపవరం మండలాలతోపాటు బద్వేలు పట్టణంలో
మూడు రోజులపాటు పాదయాత్ర చేశారు. ఎవరు నువ్వు ఊహించని స్థాయిలో ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద స్థాయిలో హాజరయ్యారు. లోకేష్ తో కలిసి చేయి చేయి చెయ్యి కలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.
ముఖ్యంగా బద్వేల్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో వేలాదిమంది ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకొని బద్వేలు పార్టీ నేత రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర శ్రీకారం చేయబోతున్నారు
. రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్ర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామ గ్రామాన జరగబోతుంది. ఇందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర విజయవంతం చేసేందుకు ఇబద్వేల్ పట్టణంలో ఒక వితంతు మహిళ ఇంటిని వైకాపా నాయకులు కార్యకర్తలు పట్టపగలు విషయాన్ని ఆయన ఈ పాదయాత్రలో ప్రజలకు చెప్పబోతున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని మండలాల వారీగా సర్వే నెంబర్లో వైకాపా నాయకులు కార్యకర్తలు ఎన్ని వందల ఎకరాల భూములు ఆక్రమించింది ఎన్ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించింది రితేష్ కుమార్ రెడ్డి ఈ పాదయాత్రలో ప్రజలకు చెప్పబోతున్నట్లు సమాచారం. మరోసారి వైకాపాను నమ్మి ఓట్లు వేస్తే మీ జీవితాలు ఉండవని ఆయన ప్రజలకు చెప్పబోతున్నట్లు సమాచారం అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి గురించి వివరించ బోతున్నారు.