సిరా న్యూస్,అంబేద్కర్ కోనసీమ;
ఆలమూరు మండలం మడికి శివారు నాగులపేటలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలు ప్రకారం గొంపా మాలిబాబు కొండమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో తాటాకు ఇంటిలో నివాసం ఉంటుండగా శుక్రవారం ఉదయం విద్యుత్ వైర్ల నుండి ఏర్పడిన మంటలతో ఇల్లు ఒక్కసారిగా అంటుకుని కాలిబూడిద అయినట్లు తెలిపారు. ఇంటిలో ఉన్న వంట సామాగ్రి, దుస్తులు, సైకిళ్లు, ద్విచక్ర వాహనంతో పాటు అన్ని కాలి బూడిద అవ్వడంతో సుమారు లక్ష రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు వారు తెలిపారు. మంటలు పక్క గృహాలకు వ్యాప్తి చెందకుండా స్థానికులు ఆపారు. కట్టు బట్టలతో మిగిలిన వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు తెలిపారు.