సిరాన్యూస్, కడెం
సకాలంలో డబ్బులు అందేలా చూస్తాం: డీఆర్‌డీఓ విజయలక్ష్మీ
ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు అందేలా చూస్తామని డీఆర్‌డీఓ విజయలక్ష్మీ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రం లో శుక్రవారం ఉదయం ఉపాధి కూలీలను డీఆర్‌డీఓ విజయలక్ష్మీ కలిసి వారితో ముచ్చటించారు.ఉపాధి కూలీలకు సరైన సమయం లో డబ్బులు అందుతున్నాయా.. లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలి చేసే ప్రతి ఒక్కరికి సకాలంలో డబ్బులు అందేలా చూస్తానని ఉపాధి కూలీలకు హామీ ఇచ్చారు.తరువాత మండల కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని వారు కోరారు. కార్యక్రమంలో హెచ్ ఆర్ సుధాకర్ ఏపీఓ జయదేవ్, టీఏ గణేష్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభాకర్ పాల్గొన్నారు.