Loka Praveen Reddy: ఆత్రం సుగుణక్కను ఎంపీగా గెలిపించాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:
ఆత్రం సుగుణక్కను ఎంపీగా గెలిపించాలి

ప్రతీ ఒక్కరు చెయ్యి గుర్తుకు ఓటు వేసి, ఆత్రం సుగుణక్కను ఎంపీగా గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టి ఆదిలాబాద్‌ పట్టణం ఎన్నికల ఇంచార్జి లోక ప్రవీణ్‌ రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మోచిగల్లి, ద్వారక నగర్‌లలో కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సా«ధ్యమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన విధంగానే ఈ సారి కేంద్రంలో సైతం ఆధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలోకి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం 5 న్యాయాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *