సిరాన్యూస్, చిగురుమామిడి
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు తథ్యం
* బొమ్మనపల్లి సీపీఐ గ్రామ కార్యదర్శి అందే సంపత్
* బొమ్మనపల్లి లో సీపీఐ నాయకుల విస్తృత ప్రచారం
భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలుపు తధ్యమని చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి సీపీఐ గ్రామ కార్యదర్శి అందే సంపత్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విస్తృతంగా ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు ప్రజలకు ఎంతగానో మేలు చేశాయన్నారు. దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వాటిని నివారించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ అధ్యక్షుడు కాంపల్లి రాజయ్య, ఏఐవైఎఫ్ యూత్ అధ్యక్షుడు మిట్టపల్లి దిలీప్, సీనియర్ సిపిఐ నాయకులు మాతంగి శ్రవణ్, మాతంగి ప్రవీణ్, మాతంగి జానీ రాజేందర్ పాల్గొన్నారు.