సిరాన్యూస్, చిగురుమామిడి
ల్యాండ్ డీడ్ చట్టంతో మనకు అన్యాయమే : అమిలినేని సురేంద్ర బాబు
* పాపంపల్లిలో అమిలినేని ఎన్నికల రోడ్ షో
ల్యాండ్ డీడ్ చట్టంతో మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. శనివారం అనంతపురం జిల్లా కుందుర్పి మండలం పాపంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన ల్యాండ్ డీడ్ చట్టంతో తెచ్చిన మన భూములను మనకు కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, మన భూముల పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫొటో వేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకునే భూములకు వరిజినల్ పత్రాలు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తాడంటే మనకు ఏమి హక్కులు లేకుండా పోతాయని అందరు గుర్తుంచుకోవాలన్నారు. బీటీపీ కాలువ, కుందుర్పి బ్రాంచ్ కేనాల్ పనులు రెండున్నరేళ్లలో పూర్తి చేసి సాగు, తాగు నీరిచ్చి ప్రజల ఋణం తీర్చుకుంటానని తెలిపారు. గ్రామాల్లో అవసరమైన మౌళిక వసతులు కల్పించి గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. పరిశ్రమల కోసం తిమ్మసముద్రం ప్రాంతంలో ఉన్న భూమిలో విద్యుత్, నీళ్ళు, రోడ్లు వేయగలిగితే పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని చెప్పారు. అందులో మన ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మరికొదరికిఉపాధిలభిస్తుందన్నారు..అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు ఈనెల 13న ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కళ్యాణదుర్గం మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.