పులివర్తి సుధా రెడ్డి.
సిరా న్యూస్,చంద్రగిరి;
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నేతలు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తు తిరుపతి రూరల్ తిరుచానూరు రోడ్డుపై బైఠాయించి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి మరియు కూటమి శ్రేణులు ధర్నాకు దిగారు. అరెస్ట్ చెయ్యలేదంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆమె తెలిపారు. దాడి జరిగిన గంటలో నిండితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసు యంత్రంగా తెలిపి ఇప్పటివరకు మౌనం వహిస్తున్నారని పోలీసులపై సుధా రెడ్డి మండిపడ్డారు.
==================