సిరాన్యూస్, భీమదేవరపల్లి
మల్లారంలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ
భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారం ఎల్లమ్మ తల్లికి ఐదు రోజుల పండగ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్లమ్మ తల్లికి ఏడంతరాల బోనంతో పాటు, ఘటంకుండ, మాత బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి కల్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ముఖ్య నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.