సిరాన్యూస్, ఆదిలాబాద్
కజ్జర్ల పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి తొలగించాలి
* ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్
* ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని దళిత అభివృద్ధి శాఖ అధికారికి ఫిర్యాదు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల పంచాయతీ కార్యదర్శిని విధుల నుంచి తొలగించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ కార్యదర్శి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని దళిత అభివృద్ధి శాఖ అధికారి సునీతకు బుధవారం ధర్మ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ మాట్లాడుతూ కజ్జర్ల గ్రామ కార్యదర్శి కస్తూరి శోభారాణి, గ్రామ కారోబారి ఉమాఉమాకంత్ లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతి నిది మొట్టే కిరణ్ కుమార్( మాజీ సర్పంచ్ భర్త) తో భోజనాలు చేయించారని తెలిపారు. ఎన్నికల సిబ్బంది తో కలిసి భోజనాలు చేస్తూ పోలింగ్ బూత్ ఆవరణలోనే ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించాలని అన్నారు. ఇలాంటి అధికారులు గ్రామ పరిపాలన విధానంలో పనికిరారని, పార్టీ కార్యకర్తల వ్యవహరించేటటువంటి ఇలాంటి అధికారులను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ తేదీ రోజునే సెక్టర్ ఆఫీసర్ తిరుపతి కి ఫిర్యాదు చేశామని, జరిగిన సంఘటనలో ఏ ఎస్ పి, ఎస్సై ధనశ్రీల హామీతో ఆందోళన విరమించామని అన్నారు. వెంటనే ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోలేని పక్షంలో గ్రామ జిల్లాస్థాయిలో ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేశారు. ధర్మ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీ నాయకులు కలిసి ఎన్నికల నిబంధన ఉల్లంఘన పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్, ఎంపీటీసీ గోదావరి కమలాకర్, వైస్ ఎంపీపీ తలమడుగు శార్త స్వామి, మునిగంటి శ్రీనివాస్, నించకవి గణేష్, శార్త రవి, అగ్గిమల్ల గంగన్న, నవీన్ కుమార్, సాయికుమార్, రామేల్లి సురేష్ కుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.