సిరాన్యూస్, బేల
బేల నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి జి. నగేష్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ వారి నివాసంలో వేరువేరుగా బీజేపీ బేల మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల బీజేపీ పార్టీ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలు, యువజన సంఘాల వారికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి గోడాం నగేష్ ధన్యవాదములు తెలిపారు.ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సరళి పై చర్చించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇంద్రశేఖర్, మనియార్పుర్ మాజీ సర్పంచ్ తేజ్ రావ్, కార్యకర్తలు నారాయణ ఉప్పల్వార్ తదితరులు పాల్గొన్నారు.