సిరా న్యూస్,నెల్లూరు;
గత ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై టిడిపి పోరాటం చేసింది. వై.సి.పి.ప్రభత్వంలో నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రఅన్నారు. ఎన్నికల సమయంలో.కొందరు పోలీస్ అధికారులు పరిధి దాటి ప్రవర్తించారు. చంద్రగిరి నియోజకవర్గ ల్ స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఘటనే నిదర్శనం. వై.సి.పి.నేతలు..గూండాలు..స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మరణాయుధాలతో ఎందుకు వచ్చారు. వీరిని పోలీసులు ఎలా అనుమతించారు. తిరుపతి ఎస్.పి.పాటిల్ మాత్రం దీన్ని చిన్న ఘటనగా చెప్పడం దారుణమని అన్నారు.
గూడూరులో కూడా పోలీసులు టిడిపి నేతలపైనే దాడి చేశారు. డి.ఎస్.పి.సూర్యనారాయణ రెడ్డి…సి.ఐ.వేణు గోపాల్ రెడ్డి…ఎస్.ఐ.అంజి రెడ్డి లు మితి మీరి ప్రవర్తించారు. చిల్లకూరు…ఉదయగిరి లలో టిడిపి అభ్యర్థులను పోలీసులు బెదిరించారు. తిరుప, నెల్లూరు పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పల్నాడులో వై.సి.పి.నేతలు దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు సరిగా వ్యవహరించలేదని వై.సి.పి.నేతలు సజ్జల, అనిల్.కుమార్ యాదవ్ లు చెప్పడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో వై.సి.పి.నేతలు హత్యాయత్నం చేసి మా పైనే కేసులు పెడుతున్నారు. టిడిపి నేతలు ఇబ్బంది పడినా ఎన్నికలు సజావుగా సాగేందుకు కృషి చేశారు. రాష్ట్రాన్నికాపాడుకోవాలని ప్రజలు కసిగా తరలివచ్చి ఓట్లు వేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. 130కి పైగా స్థానాలు టిడిపి కి వచ్చే అవకాశం ఉంది. ఓటమి భయంతో వై.సి.పి.దాడులకు పాల్పడుతోందని అన్నారు.