ఈ నెల 20 నుండి 25వ తేది వరకు 27 మంది అధికారులు జిల్లాలోని రేగొండ, మహాదేవపూర్, భూపాలపల్లి, కాటారం, గన్ పూర్ మండలాల్లో పర్యటన
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందం మన జిల్లాకు వస్తున్నారని, ఎలాంటి లోటు పాట్లు రాకుండా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. బుధవారం ఐడిఓసి మినీ కాన్ఫరెన్స్ హాలు నందు ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేది వరకు కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా పంచాయతి రాజ్ శాఖల అధికారులతో పర్యటనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27 మంది అధికారులు 5 రోజుల పాటు
జిల్లాలోని భూపాలపల్లి మండలం గొర్లవీడు,
కాటారం మండలం గంగారం, మహాదేవపూర్ మండలం కాళేశ్వరం, రేగొండ మండలం కొడవటంచ, గన్ పూర్ మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ అభివృద్ధి పధకాలప అధికారుల బృందం అధ్యయనం చేయనున్నారని అన్నారు. అదే గ్రామాల్లో అధికారులు బస చేయాల్సి ఉన్నందున, బస చేసేందుకు అలాగే భోజన సౌకర్యాలు కల్పనలో ఎలాంటి లోటు పాట్లు రాకుండా ఏర్పాటు చేయాలని ఎంపిడిఓలను ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల నుండి అధికారులు వస్తున్నారని మన ప్రాంతం పై వారికి అవగాహన తక్కువగా ఉంటుందని ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. గ్రామాల్లో పరిశీలించే అంశాలపై ఎంపిడిఓలు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అధికారుల బృందానికి చూపించాలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆయా గ్రామాల్లోని నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉన్నందున అధికారులు సంసిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ పర్యటన పర్యవేక్షణకు డిపిఓ నారాయణరావును నోడల్ అధికారిగా నియమించిననట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్
మేనేజర్ కుమార్ స్వామి, డిపిఓ నారాయణరావు, డిఆర్డిఓ నరేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్, ఆయా మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.